నేలకూలిన శిక్షణ విమానం
- శిక్షణ పైలెట్ మహిమ దుర్మరణం
- గాల్లోకి ఎగిరిన పది నిమిషాల్లోనే క్రాష్
- నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
హాలియా/ పెద్దవూర, ఫిబ్రవరి 26: శిక్షణ విమానం నేలకూలడంతో ట్రైనీ పైలెట్ మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. తమిళనాడులోని చెన్నైకి చెందిన మహిమ గజరాజ్ (29) నాగార్జునసాగర్ సమీపంలో విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్లో ఆరు నెలలుగా పైలెట్‌గా శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా శనివారం ఉదయం 10:40 గంటల సమయంలో మహిమ గజరాజ్ బయల్దేరిన సెస్నా 152 ఎయిర్‌క్రాఫ్ట్ కాసేపటికే 10:50 గంటలకు పెద్దవూర మండలం తుంగతుర్తి శివారులోని రైతు గార్లపాటి ఈదయ్య బత్తాయి తోటలో నేలకూలింది. ఈ ఘటనలో మహిమ అక్కడికక్కడే మృతిచెందారు. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘటన స్థలానికి భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకొన్న నల్లగొండ ఎస్పీ రెమారాజేశ్వరి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాద కారణాలను తెలుసుకొనేందుకు పోలీస్, డీజీసీఐ, ఏవియేషన్ సంస్థ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక కారణాలతోనే ప్రమాదం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. అయితే విద్యుత్తు తీగలను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
4 నెలల ట్రైనింగ్ పూర్తి..
నందికొండ, ఫిబ్రవరి 25 : శిక్షణ విమానం ప్రమాదంలో మృతిచెందిన మహిమ గజరాజ్ నందికొండ విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో గతేడాది అక్టోబర్ 18 నుంచి శిక్షణ తీసుకొంటున్నారు. 6 నెలల కాలానికిగాను 4 నెలల శిక్షణ పూర్తయింది. గతంలో హెలికాప్టర్లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన అనుభవం ఉన్నట్టు ట్రైనింగ్ అధికారులు తెలిపారు. ఆమె భర్త పరంధామన్ హైదరాబాద్‌లో ట్రేడ్ మార్కెటింగ్ చేస్తున్నారు. వారికి వివాహమై ఏడు సంవత్సరాలు కావొస్తుంది. పిల్లలు లేరు. భార్యాభర్తలు గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చారు. ఆరు నెలల క్రితం ఆమె తండ్రి కరోనాతో మృతిచెందారు. ఇప్పుడు విమాన ప్రమాదంలో మహిమ మృతి చెందడంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

