సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖకు మహిళా పోలీసులు బలమని సీపీ అంజనీకుమార్ అన్నారు. సిటీ ఆర్ముడ్ రిజర్వు(కార్) హెడ్ క్వార్టర్స్‌లో గురువారం సిటీ మహిళా పోలీస్ అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బంది అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొంటూ అభినందనలు తెలిపారు. వారికి మెమొంటోలు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, అడ్మిన్ డీసీపీ సునీతారెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.