న్యూఢిల్లీ: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ ‘టూ ఇండియాస్’ పేరిట అమెరికాలో ఇటీవల చేసిన ఓ ప్రదర్శన వీడియో వివాదాస్పదమైంది. పగలు మహిళలను పూజిస్తూ, రాత్రి లైంగికదాడులకు పాల్పడే దేశం నుంచి వచ్చానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ గడ్డపై దాస్ భారత్‌ను అవమానించారంటూ మండిపడుతున్నారు. పలువురు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.