చెప్పినవన్నీ చేసి చూపించిన సీఎం కేసీఆర్
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ రాదని కొందరు చెప్పారు.. కానీ, కేసీఆర్ తీసుకొచ్చారు, కాళేశ్వరం కట్టలేరు అన్నారు.. కానీ, కట్టి చూపించారు, లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు.. అంతకంటే ఎక్కువే ఉద్యోగాలు ఇచ్చి చూపించారు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ దెబ్బతో ప్రతిపక్షాల చిన్న మెదడు చితికిపోయిందని అన్నారు. అందుకే రేవంత్‌రెడ్డి అర్థం లేకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు వారిని నమ్మి మోసపోవొద్దని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తానని, చక్కగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని యువతకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అనుబంధ సంస్థల నిరుద్యోగులు కూడా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకోవాలని హితవుపలికారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

