అతివతోనే అభివృద్ధి
- మహిళా సాధికారతకు రాష్ట్రంలో అనేక పథకాలు
- స్త్రీలోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
- ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నేడు సెలవు

హైదరాబాద్, మార్చి 7 ( నమస్తే తెలంగాణ): రాష్ర్టాభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళా సంక్షేమంలో ముందంజలో ఉన్నదని చెప్పారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతూ మహిళలు ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని సీఎం అన్నా రు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ, ఒంట రి మహిళలు, వితంతు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మంత్రులు సబితా, గంగుల కమలాకర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్యర్వంలో హైటెక్స్‌లో నిర్వహించిన ఏ బిజినెస్ ఐడియా ఎంట్రప్రెన్యూర్స్ కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు.
నేడు మహిళా ఉద్యోగులకు సెలవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 8) మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

