సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పై రాష్ట్ర SC, ST, BC ఉద్యోగ సంఘాల, తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (TGO) ఆధ్వర్యంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పై రాష్ట్ర SC, ST, BC ఉద్యోగ సంఘాల, తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (TGO) ఆధ్వర్యంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలతోపాటు, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో ని తన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ, TGO కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీలకు-10 శాతం, ఎస్టీలకు-5 శాతం, గౌడ కులస్తులకు-15 శాతం రిజర్వేషన్లు కేటాయించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలో కుల వృత్తులన్నింటికీ పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. అభినవ పూలేగా సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని అన్నారు. ఇది దేశంలో పెద్ద మార్పును తీసుకు వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో TGO కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి A. సత్యనారాయణ, TGO కేంద్ర సంఘం నాయకులు సహదేవ్, వెంకటయ్య, MB కృష్ణయాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rudrabhishekam | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి 51 లీటర్ల ఆవుపాలతో రుద్రాభిషేకం
Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్‌పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

