Chiranjeevi | ‘రంగమార్తాండ’కు వాయిస్ ఓవర్

రంగస్థల కళాకారుల కష్టాలు, వారి జీవన సంఘర్షణను ఇతివృత్తంగా తీసుకొని మరాఠీ భాషలో రూపొందించిన ‘నటసామ్రాట్’ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఈ చిత్రానికి అగ్ర హీరో చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. రచయిత లక్ష్మీభూపాల రాసిన వచన కవిత్వాన్ని చిరంజీవి తన వాయిస్ ఓవర్లో వినిపించారని సమాచారం. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ ట్విట్టర్ ద్వారా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ సహృదయానికి, ప్రేమకు కృతజ్ఞతలు అన్నయ్య.. ఈ సినిమాకు మీ గళం కొత్త వెలుగుల్ని తీసుకొచ్చింది’ అని కృష్ణవంశీ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

