రెండు చైనా టీకాలు బాగానే పనిచేస్తున్నాయట

వాషింగ్టన్: చైనాకు చెందిన రెండు కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేసి వైరస్‌ను అరికట్టాయని జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. సైనోఫామ్, సైనోవాక్ అనే రెండు కంపెనీలు ప్రస్తుతం వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో ఎక్కువ శాతం ఈ టీకాలే వాడుతున్నాయి. అయితే సెషెల్స్, చిలీ వంటి కొన్ని దేశాల్లో గరిష్ఠ జనాభాకు టీకాలు ఇచ్చిన తర్వాత కోవిడ్ విజృంభించడంతో వీటిపై కొన్ని అనుమానాలు తలెత్తాయి. దీంతో అమెరికాతో సహా పలు సంపన్న దేశాలు అదనపు సమాచారం కోసం పట్టుబట్టాయి. ఆ వివాదం అలా ఉండగానే ఇప్పుడు అమెరికా వైద్య సంఘం జర్నల్‌లో ఈ టీకాలు బాగాన పనిచేస్తున్నాయనే అధ్యయన నివేదిక ప్రచురితం కావడం విశేషం. యునైడెట్ అరబ్ ఎమిరేట్స్, బహరేన్, ఈజిప్టు, జోర్డాన్ దేశాల్లో 40,832 మంది వలంటీర్లలో సగం మందికి మూడు వారాల ఎడంతో రెండు డోసుల వ్యాక్సిన్, మిగతా సగం మందికి ఉత్త మందు (ప్లాసిబో) ఇచ్చారు. ఈ అద్యయనంలో డబ్ల్యూఐవీ-04, హెచ్‌బీవో-2 అనే రెండు రకాల టీకాలను వినియోగించారు. రెండువారాల తర్వాత మొదటి రకం టీకా ఇచ్చిన వారిలో 26 మందికి, రెండోరకం టీకా ఇచ్చిన వారిలో 21 మందికి, ప్లాసిబో ఇచ్చినవారిలో 95 మందికి వైరస్ సోకింది. అయితే ప్లాసిబో తీసుకున్నవారిలో కొంత వ్యాధి తీవ్రత ఉన్నప్పటికీ టీకాలు తీసుకున్నవారిలో తీవ్రత లేకపోవడం గమనించదగిన విషయమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.
అయితే ఈ అధ్యయనంలో కొన్ని పరిమితులు కనిపించాయి. టీకాలు తీసుకున్నవారిలో 85 శాతం పురుషులే. 60 ఏల్లు అంతకన్నా పైబడిన వయసువారు 2 శాతం లోపే. పైగా అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులే. మహిళలు, వృద్ధులు, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై టీకాల ప్రభావం ఎలా ఉంటుందన్న విషయమై స్పష్టత లేదంటున్నారు. అయినప్పటికీ ఈ టీకాల్లో మొదటిదానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పచ్చజెండా ఊపింది. పేద, వర్ధమాన దేశాల కోసం చేపట్టిన టీకాల కార్యక్రమం కోవాక్స్‌లో దానిని చేర్చింది. ఇక రెండో వ్యాక్సిన్ శాస్త్రీయ సమీక్ష లేదా ప్రచురణ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. సైనోవాక్ అనేపేరుతో చలామణి అవుతున్న ఈ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇంకా లభించలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

