Health tips | హనీతో హార్ట్ ఎటాక్‌కు చెక్.. తాజా అధ్యయనంలో స్పష్టం.. ఎలాగంటే..!
Health tips : పదార్థం ఏదైనా తీయగా ఉందంటే అందులోని చక్కెరలే కారణం. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సహా వివిధ రకాల పదార్థాల్లో చక్కెరలు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే చక్కెర పదార్థం ఉంటుంది. ఆ చక్కెర రకాన్ని ట్రెహలోజ్ అంటారు. ఈ ట్రెహలోజ్ గుండె వ్యాధులను నివారించడానికి తోడ్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
Health tips : పదార్థం ఏదైనా తీయగా ఉందంటే అందులోని చక్కెరలే కారణం. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సహా వివిధ రకాల పదార్థాల్లో చక్కెరలు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే చక్కెర పదార్థం ఉంటుంది. ఆ చక్కెర రకాన్ని ట్రెహలోజ్ అంటారు. ఈ ట్రెహలోజ్ గుండె వ్యాధులను నివారించడానికి తోడ్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
అధ్యయనకారులు కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేసి పరిశోధించారు. ఆ పరిశోధనా ఫలితాలు ట్రెహలోజ్ గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తుందనే అభిప్రాయం కలుగజేశాయట. తేనెలోని ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్ (ఒక రకమైన పాచి) చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించిందట.
అయితే ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లో, ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లో మాత్రం ప్లాక్ తగ్గుదల కనిపించలేదట. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్ అనే ఒక రకం ఇమ్యూన్ కణాలు చేస్తుంటాయి. మ్యాక్రోఫేజ్ కణాలను పుట్టించడానికి అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రొటీన్ ఉత్పాదనకు ట్రెహలోజ్ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్ సాయంతో రక్తనాళాల్లోని పాచిని తొలగించి, తద్వారా గుండెపోటును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

