Suicide | ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య
Suicide | ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువకుడు, యువతిని నమ్మించి మోసం చేయడంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
జోగులాంబ గద్వాల : ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని (Love and marriage) యువకుడు, యువతిని నమ్మించి మోసం చేయడంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య ( Suicide) చేసుకుంది. జిల్లాలోని గట్టు పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక, చినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది.
తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి రెండు నెలల క్రితం చిన్నోనిపల్లి గ్రామానికి రాగా ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అప్పట్లోనే ఆమె గద్వాల జిల్లా పోలీసులను ఆశ్రయించింది. చీటింగ్ కేసు నమోదు కాగా ఆ యువకుడు జైలుకు వెళ్లి ఇటీవల విడుదల అయ్యాడు. అప్పటి నుంచి ఆ యువకుడి ఇంట్లోనే ఆ యువతి నివసిస్తోంది. పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరగా యువకుడు నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ప్రియాంక పురుగుల మందు సేవించింది.
గద్వాల ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి ఆ గ్రామానికి చేరుకున్న యువతి శనివారం ఉదయం మృతి చెందింది. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

