పాక్ గెలుపుపై వేడుకలు.. కశ్మీర్ విద్యార్థులపై కేసులు

శ్రీనగర్, అక్టోబర్ 26: టీ-20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియాపై పాక్ జట్టు గెలువడంతో సంబరాలు చేసుకున్న వైద్య విద్యార్థులపై జమ్ముకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద రెండు కేసులు నమోదుచేశారు. స్కిమ్స్ సౌర, కరణ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులపై ఆయా ఠాణాల్లో కేసులు నమోదుచేసినట్టు అధికారులు మంగళవారం తెలిపారు. భారత్‌పై పాక్ జట్టు గెలువడంతో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మానవతా దృక్పథంలో విద్యార్థులపై పెట్టిన యూఏపీఏ కేసులను ఉపసంహరించాలని జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు విజ్ఞప్తిచేసింది. మరోవైపు, పాక్ గెలువడాన్ని కీర్తిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ పెట్టినందుకు రాజస్థాన్‌కు చెందిన ఉపాధ్యాయురాలు నఫీసాని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీనిపై నఫీసా క్షమాపణలు కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
Dad’s Little Friend | ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ : నిర్మాత దీపక్
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

