సరుకులు కొంటే క్యారీబ్యాగ్ ఉచితమే
- డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు
- సూపర్మార్కెట్లకు వినియోగదారుల ఫోరం హెచ్చరిక

హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ): సూపర్మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, వాణిజ్య సముదాయాల్లో సరుకులు కొన్న వినియోగదారులకు ఉచితంగా క్యారీబ్యాగ్‌లు ఇవ్వాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని తెలంగాణ వినియోగదారుల ఫోరం హెచ్చరించింది. క్యారీబ్యాగ్‌పై షాప్ లోగో ఉన్నా లేకున్నా వినియోగదారుల నుంచి డబ్బులేమీ వసూలు చేయకూడదని ఆదేశించింది. ఓయూ విద్యార్థి బెగ్లెకర్ ఆకాశ్‌కుమార్ ఫిర్యాదుపై విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆకాశ్‌కుమార్ 2019 మే 5న హైదర్‌గూడలోని డీమార్ట్‌లో రూ.602.70 విలువైన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేశాడు. క్యారీబ్యాగ్‌కు రూ.3.50 వసూలు చేయడంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుచేశాడు. ఫోరం దీనిపై మంగళవారం తీర్పు వెల్లడించింది. ఆకాశ్‌కుమార్ నుంచి వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతోపాటు పరిహారంగా అతనికి రూ.1,000, న్యాయసేవా కేంద్రానికి మరో రూ.1,000 చొప్పున 45 రోజుల్లోగా చెల్లించాలని హైదర్‌గూడ డీమార్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

