ప్రత్యర్థిపై కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు
Magnus Carlsen: వరల్డ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి హన్స్ నీమ్యాన్ పదే పదే చీటింగ్‌కు పాల్పడినట్లు కార్ల్సన్ ఆరోపించాడు. తన ట్విట్టర్లో దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి వై
న్యూఢిల్లీ: వరల్డ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి హన్స్ నీమ్యాన్ పదే పదే చీటింగ్‌కు పాల్పడినట్లు కార్ల్సన్ ఆరోపించాడు. తన ట్విట్టర్లో దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు. సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో కార్ల్సన్ తన ట్వీట్లో వివరణ ఇచ్చుకున్నాడు. గతంలో చీటింగ్‌కు పాల్పడినట్లు ఇటీవల నీమ్యాన్ అంగీకరించిన విషయం తెలిసిందే. దాన్ని గుర్తు చేసిన కార్ల్సన్.. అలాంటి ప్లేయర్‌తో ఆడలేనన్నాడు. ఆన్లైన్లోనే కాదు.. బోర్డ్ ప్లేలో కూడా నీమ్యాన్ చీటింగ్ చేసినట్లు కార్ల్సన్ పేర్కొన్నాడు. ఇటీవల సెయింట్ లూయిస్‌లో జరిగిన ఓ టోర్నమెంట్లో నీమ్యాన్ చేతిలో కార్ల్సన్ ఓటమి పాలయ్యాడు. వరల్డ్ చాంపియన్ షాకింగ్ రీతిలో ఆ టోర్నీలో నిష్క్రమించాడు. అయితే ప్రత్యర్థిపై తొలిసారి కార్ల్సన్ పబ్లిక్‌గా చీటింగ్ ఆరోపణలు చేశాడు. కేవలం తన కెరీర్‌ను దెబ్బతీసేందుకు తనపై కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు నీమ్యాన్ ఆరోపించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

