కెనరా బ్యాంక్ లాభం 1,502 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 27: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,502 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.696 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. రెండో త్రైమాసికంలో నమోదైన రూ.1,333 కోట్లతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది. కానీ, ఆదాయం మాత్రం రూ.21,365 కోట్ల నుంచి రూ.21,312 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ అడ్వాన్స్‌ల్లో 7.80 శాతానికి చేరుకున్నది. గతంలో ఇది 7.46 శాతంగా ఉన్నది.
- నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా 2.64 శాతం నుంచి 2.86 శాతానికి పెరిగింది.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.2,245 కోట్ల నిధులను వెచ్చించింది. ఏడాది క్రితం రూ.4,210 కోట్లు వెచ్చించింది.
- కన్సాలిడేటెడ్ ఆధారంగా బ్యాంక్ నికర లాభం రెండు రెట్లు పెరిగి 1,631 కోట్లుగా నమోదైంది.
- అంతర్జాతీయంగా బ్యాంక్ బిజినెస్ 8 శాతం ఎగబాకి రూ.17,72,856 కోట్లకు చేరింది. వీటిలో డిపాజిట్లు రూ.10,43,350 కోట్లు కాగా, అడ్వాన్స్‌లు రూ.7,29,506 కోట్లు
- గతేడాది చివరినాటికి బ్యాంక్ 9,773 శాఖలను కలిగివున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

