గర్భదారణ సమయంలో యోగాసనాలు వేయొచ్చా.. ? వజ్ర త్రికోణాసనం ఎలా వేయాలి ?
గర్భధారణ సమయంలో యోగాసనాలు సాధన చేయడం వల్ల కాన్పు తర్వాత శరీరంలో వచ్చే ప్రతికూల మార్పులకు అడ్డుకట్ట వేయవచ్చు. పరిపూర్ణ ఆరోగ్యంగానూ ఉండవచ్చు. వెన్నెముకకు వెన్నుదన్నుగా నిలిచే వజ్ర త్రికోణాసనం ఎలా వేయాలంటే..

- ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. అంటే, రెండు కాళ్లను వెనక్కి ముడుచుకొని, పాదాలు పిరుదుల కిందికి తీసుకోవాలి. శరీరాన్ని కాస్త పైకెత్తాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
- ఇప్పుడు నిదానంగా మోకాళ్లపై పైకి లేచి శ్వాస తీసుకోవాలి.
- ఊపిరి వదులుతూ కుడికాలిని చిత్రంలో చూపినట్టు పక్కకు జరపాలి. కుడిచేతిని కుడి మోకాలిపై ఉంచాలి. ఎడమ చేతిని నిటారుగా పైకెత్తాలి. మోచేయి ఎడమవైపు చూసేలా ఉండాలి. ముఖాన్ని కాస్త పైకెత్తి ఎడమ అరచేతిపై దృష్టి నిలపాలి.
- ఈ ఆసన స్థితిలో ఐదారుసార్లు నిదానంగా శ్వాసక్రియ కొనసాగించాలి.
- తర్వాత మళ్లీ వజ్రాసన స్థితికి వచ్చి రెండోవైపు కూడా ఇదే విధంగా ఆసనం కొనసాగించాలి.
ప్రయోజనాలు: వజ్ర త్రికోణాసనంతో కటి ఎముకలు బలంగా తయారవుతాయి. మూత్రపిండాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. వెన్నెముక దృఢత్వం పెరుగుతుంది. సయాటికా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ, డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆసనం వేయాలి. మధ్యలో ఇబ్బంది అనిపిస్తే ఆపేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

