రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్లో చర్చ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చ | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఆయా జిల్లాల్లో నెలకొన్న కొవిడ్ పరిస్థితులు, మహమ్మారి నిర్మూలనకు తీసుకున్న చర్యలు, అధికారులకు ఇచ్చిన సలహాలు, సూచనలు.. తదితర క్షేత్రస్థాయి పర్యటన వివరాలను కేబినెట్‌కు వివరించారు. ఈ సందర్భంగా మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాలపై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషధాల లభ్యత సహా థర్డ్ వేవ్‌కు సంబంధించిన సన్నద్ధతపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేబినెట్‌కు సమాచారం అందించారు. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే పలు అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో, మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

