ఈ దశాబ్ధపు వైరల్ సాంగ్ ఏదో తెలుసా?

సినీ పరిశ్రమలో సినిమాలు చరిత్ర సృష్టించడం ఎక్కువగా చూస్తుంటాం. కాని ఓ సాంగ్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. సామాన్యుడు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ సాంగ్కు తెగ ఫిదా అయ్యారు. వార్నర్ వంటి స్టార్ క్రికెటర్ కూడా ఈ సాంగ్కు స్టెప్పులేయడంతో ఫుల్ పాపులర్ అయింది. ఈ సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్స చేసి సంచలనాలు సృష్టించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, ఇందులోని ప్రతి పాట శ్రోతలని అలరించింది. అర్మాన్ మాలిక్ పాడిన బుట్టబొమ్మ మరింత ఎక్కువగా జనాలకు రీచ్ అయింది. ఈ సాంగ్ ఈ దశాబ్దంలోనే మోస్ట్ వైరల్ అయిందని చెబుతూ మిర్చి అవార్డ్స్ వారు సాంగ్ పాడిన అర్మాన్ మాలిక్ కు అవార్డు అందించారు. ఈ విషయాన్ని అర్మాన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తన టీం అంతటికీ తన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక ఈ అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నాని తెలిపాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

