కొత్త సినిమా కోసం ‘మల్లీశ్వరి’ న్యూ లుక్

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ కత్రినాకైఫ్. ఆ తర్వాత హిందీలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ బిజీ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న కత్రినా ఈ సారి కొత్త లుక్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తానంటోంది. న్యూ హెయిర్‌కట్, న్యూ లుక్‌తో ఉన్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్లూ క్రాప్ టాప్, డెనిమ్ షార్ట్స్, ఓపెన్ హెయిర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..కొత్త రోజు, కొత్త హెయిర్ కట్, కొత్త సినిమా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే కత్రినా ఏ ప్రాజెక్టును మొదలుపెడుతుందో మాత్రం చెప్పలేదు. ఈ బ్యూటీ ఇటీవలే సల్మాన్‌ఖాన్‌తో కలిసి టైగర్ 3 షూటింగ్లో పాల్గొన్నది. మరోవైపు రోహిత్‌శెట్టి-అక్షయ్ కుమార్ కాంబోలో వస్తున్న సూర్యవంశి చిత్రంలో నటిస్తోంది. ఇషాన్‌ఖట్టర్, సిద్దాంత్ చతుర్వేదితో కలిసి ఫోన్ బూత్‌లో నటిస్తోంది. మరి కత్రినా కొత్త సినిమా అని ప్రస్తావించడంతో..ఈ ప్రాజెక్టులు కాకుండా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? ఏంటని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

