లో ప్రైస్ లో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ఇవిగో…

ముంబై, జూన్ 12: తక్కువ ధరలో నాణ్యమైన బ్రాండ్ బ్యాండ్ సేవలకోసం ఎదురుచూస్తున్నారా..! అయితే ఈ ఆఫర్లు మీకోసమే… వోడాఫోన్ ఐడియా (వీఐ) టెలికాం సంస్థ ‘యు’ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టింది. కస్టమర్ బేస్ ను పెంచుకోవడం కోసం తన బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌లకు మార్కెట్ లో పోటీగా తన ఆఫర్లను అందిస్తున్నది.
రిలయన్స్ జియో ,భారతి ఎయిర్టెల్ ఆఫర్లతో పోలిస్తే వోడాఫోన్ ఐడియా ఏ ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్పీ)ఇవ్వని ప్లాన్లను తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు దాని ఆఫర్లను అప్ డేట్ చేసిన తరువాత వోడాఫోన్ ఐడియా ‘యు’బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ చాలా బాగున్నాయి. వోడాఫోన్ ఐడియాబ్రాడ్బ్యాండ్ సేవలు ప్రస్తుతం అందించే అనేక సర్కిల్‌లలో దాని ఆఫర్లను అప్ డేట్ చేస్తున్నది. ప్రస్తుతానికి అహ్మదాబాద్ లో మాత్రమే అప్ డేట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
‘యు’ బ్రాడ్‌బ్యాండ్ నుంచి లభించే మొదటి ప్లాన్ నెలకు రూ. 400ధరకు లభిస్తుంది. ఇది తన వినియోగదారులకు అపరిమిత డేటా (3.5TB ఎఫ్‌యుపి పరిమితి) ను 30Mbps వేగంతో అందిస్తుంది. కంపెనీ తన వినియోగదారులకు అందించే వై-ఫై రౌటర్ , మోడెమ్ కోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే కనెక్షన్లో ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు. ఇంకా ఈ ప్లాన్‌తో ఓవర్-ది-టాప్ ప్రయోజనాలు ఉండవు.
రెండో ప్లాన్ నెలకు రూ .679 ధరకు లభిస్తుంది. ఈ ప్లాన్ కూడా వినియోగదారులకు అదే 3.5TB FUP డేటాను 50 Mbps వేగంతో అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ లో కూడా ఎటువంటి OTT ప్రయోజనాలు లేవు. అయితే ఈ ప్లాన్‌లో అదనపు పన్నులు ఉంటాయి. 100 Mbps , 200 Mbps స్పీడ్‌తో సహా కొన్ని హై-స్పీడ్ ప్లాన్లను కూడా కంపెనీ అందిస్తుంది. ఇంకా అన్ని ప్లాన్లు ఒకే మొత్తంలో FUP డేటా (3.5TB) తో వస్తాయి. 100 Mbps ప్లాన్ నెలకు రూ.826 ధరకు లభిస్తుంది. అలాగే 200 Mbps ప్లాన్ నెలకు రూ.1,062 ధరకు వస్తుంది.వినియోగదారులు సంస్థ నుంచి వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు కానీ వారికి అదనపు ఛార్జీలు ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

