హైదరాబాద్: డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాయలం ప్రవేశాల గడువును పొడగించారు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 9 వరకు పెంచినట్లు వీసీ ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, తదితర కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడగించామని వెల్లడించారు. విద్యార్థులు ప్రవేశాల కోసం www.braouonline.in, 73829 29570/580, 040-23680290/291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.