కించపరిస్తే ఊరుకోం.. కన్నప్ప చిత్రబృందానికి బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య హెచ్చరిక
చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ ప్రాంతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం సరోజిని డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆర్కే పురం, జూన్ 9: చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ ప్రాంతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం సరోజిని డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణులను కానీ, ఇతర కులాలను కానీ, మతాలను కానీ కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. మంచు మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణ జాతి పై పగబట్టిందనే బాధ బ్రాహ్మణులలో నెలకొని ఉందని శ్రీనివాస్ రావు అన్నారు. గతంలో దేనికైనా రెడీ అనే సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు చిత్రించడమే కాకుండా బ్రాహ్మణులపై భౌతిక దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. తాజాగా కన్నప్ప అనే సినిమాలో పిలక-గిలక అనే రెండు పాత్రలను రూపొందించి బ్రాహ్మణులను కించపరిచారని మండిపడ్డారు.
మంచు మోహన్ బాబు కుటుంబం చట్టాలను ఉల్లంఘించిందని, కన్నప్ప సినిమాపై కోర్టులో కేసు ఉండగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం చట్టాలను ఉల్లంఘించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వృత్తిపరంగా బ్రాహ్మణులనే కాదు ఏ కులం వారినైనా కించపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించడం ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. తక్షణమే మోహన్ బాబు కుటుంబం యావత్ మానవ జాతికి క్షమాపణ చెప్పి “కన్నప్ప” సినిమాలో ఉన్న పిలక-గిలక సన్నివేశాలను తొలగించాలని శ్రీనివాసరావు కోరారు. ఇందుకోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

