బీబీ3 అప్డేట్..అఘోరా పాత్రకు బోయపాటి భారీ ప్లాన్

నందమూరి బాలకృష్ణ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మాస్.. కమర్షియల్ సినిమాలు. బాలయ్య చేసినన్ని ప్రయోగాలు మరే సీనియర్ హీరో చేయలేదు. అందుకే ఆయన కెరీర్ లో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే అంటాడు బాలయ్య. అందుకే ఈయన్ని దర్శకుల హీరో అంటారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు బాలయ్య. బోయపాటి కోసం అఘోరగా మారుతున్నాడు. ఓ స్టార్ హీరో అఘోరాగా మారడం అంటే చిన్న విషయం కాదు.. దర్శకుడిపై గుడ్డి నమ్మకం ఉంటే కానీ అది జరగదు. బోయపాటిని అంతగా నమ్మాడు ఈయన. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఊహించడం కష్టమే కానీ చేసి చూపిస్తున్నాడు బాలయ్య. అందుకే అఘోరా అవతారం ఎత్తాడు బాలయ్య.
ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలో అఘోరా పాత్ర చేస్తున్నాడని బోయపాటి కూడా ఖరారు చేసాడు. ఈ పాత్రపై సపరేట్ ఫోకస్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. మొన్నటి వరకు BB3 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. మార్చి నాలుగో వారం నుంచి అఘోరా పాత్రపై అక్కడే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నాడు దర్శకుడు బోయపాటి. ఈ సినిమాలో ఇంటర్వెల్ టైమ్‌కు అఘోరా పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. అక్కడ్నుంచి అఘోరాగా బాలయ్య చేసే అద్భుతాలు చూడాల్సిందే కానీ చెప్పలేం అంటున్నారు మేకర్స్. పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములాతోనే వస్తున్న ఈ సినిమాలో అఘోరాగా ఉండే పాయింట్ బోయపాటి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ దానిపై మాత్రం నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. ఈ రెండు పాత్రల కోసం ఫిజికల్‌గానూ చాలా కష్టపడ్డాడు నందమూరి నటసింహం. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆర్ఎఫ్సీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఘోరా పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఇంతటి అంచనాలు పెంచేస్తున్న బోయపాటి.. సినిమాలో ఎలా చూపించబోతున్నాడనేది మరింత ఆసక్తికంగా మారిపోయింది. BB3 సినిమాను ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న విడుదల చేయనున్నారు. గతంలో బోయపాటితో జయ జానకీ నాయకా సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

