Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
Bomb Cyclone effect | అగ్రరాజ్యం అమెరికా (USA) ను బాంబ్ సైక్లోన్ (Bomb Cyclone) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అతివేగంగా ఏర్పడే తుపానులనే బాంబ్ సైక్లోన్స్ అంటారు. అమెరికాపై ఆకస్మికంగా విరుచుకుపడ్డ ఈ బాంబ్ సైక్లోన్ అట్లాంటిక్ తీరంలోని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా న్యూయార్క్ (New York), న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Bomb Cyclone effect : అగ్రరాజ్యం అమెరికా (USA) ను బాంబ్ సైక్లోన్ (Bomb Cyclone) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అతివేగంగా ఏర్పడే తుపానులనే బాంబ్ సైక్లోన్స్ అంటారు. అమెరికాపై ఆకస్మికంగా విరుచుకుపడ్డ ఈ బాంబ్ సైక్లోన్ అట్లాంటిక్ తీరంలోని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా న్యూయార్క్ (New York), న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తి వీధులు నదులను తలపిస్తున్నాయి.
‘థ్యాంక్స్ గివింగ్ డే’ వేళ బాంబ్ సైక్లోన్ విరుచుకుపడటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో ఈదరుగాలులు వీస్తున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు 9 లక్షల మంది ఇబ్బందులు పడినట్లు పవర్ ట్రాకింగ్ వెబ్సైట్ వెల్లడించింది. మొత్తం 420 విమానాలు రద్దయ్యాయని, సుమారు 2000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
న్యూజెర్సీ హొబుకెన్ ట్రాన్సిట్ రైల్వే ట్రాక్ వరద నీటిలో మునిగింది. స్టోన్ హర్బర్లోకి భారీగా నీరు చేరింది. న్యూయార్క్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఈ తుపాను ప్రభావం అట్లాంటిక్ తీరంలోని 25 రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో వందేళ్లుగా జరుగుతున్న మేసిస్ థ్యాంక్స్ గివింగ్ డే పరేడ్ కూడా ఈ బాంబ్ సైక్లోన్ కారణంగా వాయిదాపడింది.
తీవ్రమైన గాలుల కారణంగా జార్జి వాషింగ్టన్ వంతెనపై ఖాళీ ట్రాలీలు, బైకుల రాకపోకలను నిషేధించారు. ఇక మేరీ ల్యాండ్‌లో 19 లక్షల మంది జనాభాకు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్చరించారు. కాగా, వాతావరణ పీడనం 24 గంటల్లోనే అసాధారణ స్థాయిలో పడిపోయే ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘బాంబో జెనిసిస్’ అంటారు. ఈ ‘బాంబో జెనిసిస్’ ప్రక్రియతో ఏర్పడే తుపానులను ‘బాంబ్ సైక్లోన్లు’ గా వ్యవహరిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

