Sunny Deol: మీకు సిగ్గు అనిపించడం లేదా?.. మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం
Sunny Deol: Sunny Deol: సన్నీ డియోల్ తన సహనాన్ని కోల్పోయాడు. మీడియాపై గరం అయ్యాడు. మీకు సిగ్గుందా అంటూ చేతులు జోడించి మరీ తిట్టేశాడు. ధర్మేంద్ర న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆయన ఫైర్ అయ్యాడు.
ముంబై: బాలీవుడ్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్(Sunny Deol) .. మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన సహనాన్ని కోల్పోయి .. నోటి మాట జారారు. ముంబైలోని ఇంటి ముందు వేచి చూస్తున్న మీడియా, ఫోటోగ్రాఫర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్రకు ఇంటి వైద్యం అందిస్తున్నారు. అయితే కవరేజీకి వెళ్లిన మీడియా.. సన్నీ డియోల్ ఇంటి ముందే పడిగాపులు కాచింది. ఆ సమయంలో మీడియాను ఉద్దేశిస్తూ సన్నీ కాస్త ఆగ్రహానికి లోనయ్యాడు.
చేతులు జోడించి మరీ సన్నీ డియోల్ మీడియాను తిట్టేశాడు. ఆప్ లోగోం కో షరమ్ ఆనే చాహియే.. ఆప్కే ఘర్ మే మా-బాప హై. అప్నే బచ్చే హై. షరమ్ నహీ ఆతీ అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా, మీకూ తల్లితండ్రులు, పిల్లలు లేరా, సిగ్గుగా ఎందుకు లేదని సన్నీ అన్నారు. ధర్మేంద్ర గురించి న్యూస్ను ప్రచురించే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి ఫ్యామిలీ ఇంటి ముందే మీడియా ఎదురుచూస్తున్నది. దీంతో తీవ్ర ఫ్రస్టేషన్కు గురైన సన్నీ డియోల్ తనదైన స్టయిల్లో తన కోపాన్ని వ్యక్తం చేవౄడు. ప్రైవసీ ఇవ్వాలంటూ కోరాడు.
సన్నీ ఆగ్రహానికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు సన్నీకి మద్దతు తెలిపారు. డియోల్ ఫ్యామిలీ ప్రైవసీని మీడియా గౌరవించడం లేదని కొందరు యూజర్లు అన్నారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన కూతురు ఈషా డియోల్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

