ఆది సాయికుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్’. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు పాజిటివ్ స్పందన వచ్చింది. ఆది ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపిస్తాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి.