KTR Demand | తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం.. ఎంపీ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్
KTR Demand | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ( Telangana Formation ) పై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ -పాకిస్థాన్ ( ( Bharat-Pakistan ) విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పదే పదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమర వీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు.
స్వయంగా ప్రధానమంత్రి మోదీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య ( Tejasvi Surya ) వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నా రన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని గుర్తు చేశారు.
బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటు
అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టు కుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు.
కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.
వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని , లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

