ట్యూబెక్టమీ విఫలం.. ప్రభుత్వాన్ని రూ.11 లక్షలు డిమాండ్ చేసిన మహిళ

పాట్నా: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన రెండున్నర ఏండ్ల తర్వాత ఒక మహిళ గర్భం దాల్చింది. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారంగా రూ.11 లక్షలు డిమాండ్ చేసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఫుల్కుమారి దేవి, దాస్ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటంతో ఆ పేద కుటుంబం ఇక పిల్లలు వద్దనుకున్నది. దీంతో 2019 జూలై 27న మోతీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దేవి కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నది.
అయితే దేవి ఇటీవల గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆ మహిళ ఆశ్రయించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైనందుకు పుట్టబోయే బిడ్డకు ఖర్చుల కింద పరిహారంగా రూ.11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిలదీసినందుకు తమపట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆ దంపతులు ఆరోపించారు.
మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ముజఫర్‌పూర్ సివిల్ సర్జన్ డాక్టర్ హరేంద్ర కుమార్ అలోక్ సోమవారం బదిలీకి ముందు తెలిపారు. ఈ ఆపరేషన్లు ఒక్కోసారి విఫలమవుతాయని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితురాలికి రూ.30 వేల పరిహారం చెల్లించడంతోపాటు డెలివరీ, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే ఈ లబ్ధి పొందేందుకు బాధితురాలు ఆరోగ్య విభాగాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

