ఎర్రుపాలెం, అక్టోబర్ 4 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కాన్వాయ్‌ని ఎర్రుపాలెం ఎన్టీఆర్ కాలనీవాసులు ఆదివారం అడ్డుకున్నారు. కాలనీలో రోడ్లు, మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని, దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఏకరువు పెట్టారు.
తమ సమస్యలను వెంటనే పరిషరించాలని కోరుతూ నిరసన తెలిపారు. భట్టి విక్రమార కారు దిగి వారితో మాట్లాడారు. అనంతరం వారితో కలిసి కాలనీలో నడుచుకుంటూ వెళ్లి రోడ్లు, ఇతర మౌలిక వసతుల గురించి తెలుసుకుని, వాటి పరిషారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎర్రుపాలెం మండలంలో మొత్తం రూ.12.89 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భట్టి విక్రమార శంకుస్థాపన చేశారు.