BGSSL Jobs |బరోడా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ లిమిటెడ్ (BGSSL) బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)కు చెందిన సంస్థ. ఈ సంస్థ 1949 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా అప్రెంటిస్, ఎగ్జిక్యూటివ్, కలెక్షన్స్, డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్, అకౌంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హెచ్ఆర్ వంటి 18 రకాల ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టనుంది. ఈ పోస్టులు గాంధీనగర్ (గిఫ్ట్ సిటీ), వడోదర, బెంగళూరు, ముంబైలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి. వీటికి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Bgssl Posts
ఖాళీల వివరాలు
కలెక్షన్స్ డిపార్ట్మెంట్ (Collections Department): అప్రెంటిస్ (టెలీ కాలింగ్), టెలీ కలెక్షన్ ఏజెంట్ (డెబిట్ రికవరీ), డయలర్ (కాలింగ్ ఆపరేషన్స్), ఏఎం/డీఎం/లీడ్స్-టెలీ కలెక్షన్స్ (డీఆర్ఏ సర్టిఫైడ్)- 257
డిజిటల్ బ్యాంకింగ్: ఎగ్జిక్యూటివ్-ఏటీఎం/రీకాన్సిలేషన్/కంప్లైంట్స్/డెబిట్ కార్డ్స్, ఎగ్జిక్యూటివ్ డెబిట్ కార్డ్ ఆపరేషన్స్- 50
గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్: ఎగ్జిక్యూటివ్-ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్- 25
అకౌంట్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్: ఎగ్జిక్యూటివ్ (సీఏఎస్ఏ/ఎఫ్సీఎన్ఆర్/కాలింగ్)- 40
మల్టిపుల్ ఫంక్షన్స్: ప్రొక్యూర్ మేనేజ్మెంట్- 1
రిటైల్ సేల్స్: MIS అనలిస్ట్- 3
హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్: డిప్యూటీ మేనేజర్- 1
పీఎఫ్ఎంఎస్, వెల్కమ్ కిట్: ఎగ్జిక్యూటివ్/సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మేకర్స్)- 20
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT): డెస్క్‌టాప్ సపోర్ట్ అనలిస్ట్-1
హ్యూమన్ రిసోర్స్-ఎల్ అండ్ డీ: ఏఎం/డిప్యూటీ మేనేజర్- 1
ఫీల్డ్ కలెక్షన్: ఫీల్డ్ కలెక్షన్ ఆఫీసర్స్ (డీఆర్ఏ సర్టిఫైడ్)- 400
డిజిటల్ ఆన్‌బోర్డింగ్: డిజిటల్ ఆన్‌బోర్డింగ్ స్పెషలిస్ట్ (పార్ట్ టైమ్)- 400
రిటైల్ సెల్లర్స్: సేల్స్ ఆఫీసర్/ఏఎస్ఎమ్/ఆర్ఎస్ఎమ్ (లోన్.. హోమ్, ఆటో, ట్రాక్టర్, ఎడ్యుకేషన్)- 350
ఆధార్ ఆపరేషన్స్: ఆధార్ ఆపరేటర్ (పార్ట్ టైమ్, ఎస్ఎస్ఈఐటీ సర్టిఫైడ్)- 400
పై ఖాళీల్లో ఫీల్డ్ కలెక్షన్, డిజిటల్ ఆన్‌బోర్డింగ్, రిటైల్ సెల్లర్స్, ఆధార్ ఆపరేషన్స్‌లలో 1550 పోస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. మిగితా పోస్టులు ముంబై, గాంధీనగర్, వడోదర, బెంగళూరుల్లో ఉన్నాయి.
అర్హతలు
పోస్టును బడ్డి 12వ తరగతి, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించాలి. DRA, NSEIT సర్టిఫికేషన్ ఉండాలి.

Apply
ఎంపిక
దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
చివరితేదీ
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ సెప్టెంబర్ 30. ఇతర వివరాలకు వెబ్సైట్ www.bgss.in/careers చూడండి.