పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్ బెస్ట్ సీఈఓ అవార్డును అందుకున్నారు. ఈ ప్లస్ ఇంటలెక్చువల్ మీడియా ఆధ్వర్యంలో జాతీయ కోపరేటివ్ బ్యాంక్స్ కార్నివాల్ ఐకాన్స్ లీడర్ అవార్డ్స్ 2026 ను రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 26 నుండి 28 వరకు...
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 28 : పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్ బెస్ట్ సీఈఓ అవార్డును అందుకున్నారు. ఈ ప్లస్ ఇంటలెక్చువల్ మీడియా ఆధ్వర్యంలో జాతీయ కోపరేటివ్ బ్యాంక్స్ కార్నివాల్ ఐకాన్స్ లీడర్ అవార్డ్స్ 2026 ను రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 26 నుండి 28 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈవో సీత శ్రీనివాస్ బెస్ట్ సీఈవో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, సీత శ్రీనివాస్ మాట్లాడుతూ.. జాతీయ ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా అధునాతమైన సేవలను ఖాతాదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ప్రస్తుత డిపాజిట్లు రూ.405.38 కోట్లు, మంజూరు చేసిన రుణాలు రూ.292. 33 కోట్లు కలవని తెలిపారు. ప్రతి నెల మూడో శనివారం బ్యాంకు ప్రతి శాఖ నందు ఖాతాదారుల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
వీటిలో సైబర్ మోసాలు , వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు , అపరిచితులు పంపిన లింకులను క్లిక్ చేయవద్దని, ఓటిపి పాస్వర్డ్ లను ఎవరికి చెప్పవద్దని, డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండుగల వేల మోసాలు చూపే ఆఫర్లను చూసి మోసపోవద్దని అన్నారు. బ్యాంక్ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మమైన అవార్డులు గెలుపొందడం పట్ల బ్యాంకు వ్యవస్థాపకులు, గత పాలక మండలి సభ్యులు, ఖాతాదారులు, వాటాదారులు, వివిధ శాఖల మేనేజర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరి శంకర్, సురపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ, ఏజీఎం రాచకొండ మధుసూదన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస శాస్త్రి, ఐటి హెడ్ చెరుపల్లి నరేశ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

