నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివేక్‌సాగర్ స్వరకర్త. ఈ నెల 6న ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేయబోతున్నారు. శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని కారులో షికారు చేస్తూ హుషారుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, జూన్ 10 సినిమాను విడుదల చేయబోతున్నామని చిత్రబృందం పేర్కొంది. నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికెత్బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్, ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.