Balakrishna Vs NTR | బాబాయ్ వర్సెస్ అబ్బాయ్.. నందమూరి కుటుంబంలో మళ్లీ లొల్లి
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని నిరూపించే ఘటన ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే జరిగింది.
- ఎన్టీఆర్ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు
- బాలయ్య పనేనంటున్న తారక్ ఫ్యాన్స్
- వందమంది బాలయ్యలు, బాబులు వచ్చినా తారక్‌కు ఏమీకాదన్న కొడాలి
Balakrishna Vs NTR | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): నందమూరి కుటుంబంలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని నిరూపించే ఘటన ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం తెల్లవారుజామున నందమూరి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కూడా తెల్లవారుజామునే వచ్చి తాతకు నివాళి అర్పించి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తారక్ అభిమానులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో వచ్చిన బాలకృష్ణ తండ్రికి అంజలి ఘటించి వెళ్లా రు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
బాలయ్య వెళ్లిపోయిన తర్వాత ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశించడంతోనే వాటిని తొలగించారన్న ప్రచారం మొదలు కావడమే కాదు, వాటిని తొలగించాలని బాలయ్య చెప్తున్నట్టుగా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయింది. ఇది చూసిన తారక్ అభిమానులు బాలయ్యపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలో మాట్లాడుతూ.. వెయ్యిమంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా తారక్‌ను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

