బాలకృష్ణ ‘అన్నగారు’?
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో బాలకృష్ణ కనిపించిన విధానం సినిమాపై అంచనాల్ని పెంచింది. ఈ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది. ‘వీరసింహారెడ్డి’ ‘అన్నగారు’ అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘అన్నగారు’ టైటిల్‌ను ఖరారు చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. దివంగత మహానటుడు ఎన్టీఆర్‌ను అభిమానులు ప్రేమగా అన్నగారు అని సంబోధించేవారు. దీంతో ఈ టైటిల్ బాలకృష్ణకు పక్కాగా సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నదట. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

