Akshay Shinde | బద్లాపూర్ రేపిస్ట్ ఎన్కౌంటర్.. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ లైంగికదాడుల కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.
- ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన అక్షయ్ షిండే
- పోలీసు కాల్పుల్లో హతం
- కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నించగా కాల్పులు
- జరిపామన్న పోలీసులు
Akshay Shinde | ముంబై, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ లైంగికదాడుల కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో ఇటీవల ఇద్దరు నాలుగేండ్ల విద్యార్థినులపై లైంగికదాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడు షిండే సోమవారం సాయంత్రం పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.
జైలు నుంచి తరలిస్తున్న సమయంలో అతడు ఓ పోలీసు వద్దనున్న తుపాకీ గుంజుకొని కాల్పులు జరిపాడని, తాము జరిపిన ఎదురు కాల్పులు జరుపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ఓ సీనియర్ పోలీస్ అధికారి కథనం ప్రకారం.. లైంగిక దాడుల కేసులో జైలులో ఉన్న నిందితుడు షిండేపై గతవారం అతడి రెండో భార్య బోయిసర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు నిందితుడిని పోలీసులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తలోజా జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పది మంది పోలీసుల బందోబస్తు మధ్య స్టేషన్కు తరలిస్తుండగా వాహనం ముంబ్రా బైపాస్ వద్దకు చేరుకోగానే తన పక్కనే కూర్చున్న ఏఎస్ఐ వద్దనుంచి నిందితుడు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు. దీంతో ఏఎస్ఐ కాలులోకి బుల్లెట్లు దిగాయి. ఆ పక్కనే కూర్చన్న మరో అధికారి వెంటనే స్పందించి నిందితుడిపై మూడురౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు’ అని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

