Babar Azam | బాబర్ ఆజాం ఖాతాలో మరో రికార్డు.. ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన పాక్ కెప్టెన్
ఇది బాబర్‌కు టెస్టుల్లో 8వ సెంచరీ
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజం మరో రికార్డు సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. రావల్పిండిలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీ చేసిన బాబర్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో బాబర్ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి.ఇంతకుముందు అతను ఆరు శతకాలతో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోతో సరిసమానంగా ఉన్నాడు. టీ 20 వరల్డ్‌కప్‌లో నిరాశ పరిచిన బాబర్ టెస్టుల్లో తిరిగి ఫామ్ అందిపుచ్చుకున్నాడు. 168 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది బాబర్‌కు టెస్టుల్లో 8వ సెంచరీ.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలి పోప్, హ్యారీ బ్రూక్ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు 657 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. అబ్దుల్లా షఫిక్ (114), ఇమామ్ ఉల్ హక్ (121)సెంచరీలు చేశారు. బాబర్ ఆజాం కూడా శతకం సాధించడంతో మూడోరోజు ఆట ముగిసే సరికి పాకిస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

