సైనికుడిగా అల్లు అర్జున్ తనయుడు అయాన్

ఈ రోజుల్లో హీరోలు కేవలం తమను తాము కాకుండా.. తమ వారసులను కూడా బాగానే పాపులర్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ వారసులను సోషల్ మీడియా స్టార్స్ గా మార్చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కొడుకు, కూతురు ఇద్దరు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. అల్లు అర్జున్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కొడుకు అల్లు అయాన్ ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఆయన కూతురు అర్హ కూడా ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ వారసులకు కావాల్సినంత క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు స్టైలిష్ స్టార్.
ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేశాడు. తాజాగా తన కొడుకు అల్లు అయాన్ ను సైనికుడిగా మార్చేశాడు అల్లు అర్జున్. సోల్జర్ కాస్ట్యూమ్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో వీర సైనికుడిలా అదిరిపోయే పోజ్ ఇచ్చాడు అయాన్. చేతిలో గన్ పట్టుకొని యుద్ధ సైనికుడిలా నిలబడ్డాడు. ఈ ఫోటోలు చూసి అల్లువారి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఫ్యూచర్ లో తమకు మంచి హీరో దొరికేసాడు అని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు కొత్త కొత్త ఫోజులతో అల్లు అయాన్ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఈ బుడ్డోడు చేసే విన్యాసాలకు అప్పుడప్పుడు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. అల్లు వారసుడు జోరు చూస్తుంటే త్వరలోనే బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చేలా కనిపిస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- allu
- Allu arjun
- ayaan
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

