బై బై.. బార్టీ
ఆల్‌రౌండర్ అనే పదానికి అసలు సిసలు అర్థం! ఎంచుకున్న ఒక్క క్రీడలో జాతీయ స్థాయికి ఎదగడమే ఎంతో కష్టమైన స్థితిలో..మూడు క్రీడల్లో అత్యున్నత స్థాయి ప్రదర్శనలు చేయడం ఆమెకే చెల్లింది!!
- టెన్నిస్‌కు ఆసీస్ స్టార్ వీడ్కోలు
- పాతికేండ్లకే సంచలన నిర్ణయం
ఆల్‌రౌండర్ అనే పదానికి అసలు సిసలు అర్థం! ఎంచుకున్న ఒక్క క్రీడలో జాతీయ స్థాయికి ఎదగడమే ఎంతో కష్టమైన స్థితిలో..మూడు క్రీడల్లో అత్యున్నత స్థాయి ప్రదర్శనలు చేయడం ఆమెకే చెల్లింది!!
పద్నాలుగేండ్ల వయసులో జూనియర్ వింబుల్డన్ టైటిల్ పట్టిన ఆ చిచ్చర పిడుగు.. టెన్నిస్‌కు బ్రేక్ ఇచ్చి తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న క్రికెట్లో అడుగుపెట్టింది. ఏదో సాదాసీదాగా ప్రాక్టీస్ చేసి వదిలేయకుండా బిగ్ బాష్ లీగ్‌లో ఓ సీజన్ పాటు ఆల్‌రౌండర్‌గా సేవలందించింది. మళ్లీ మనసు మార్చుకొని రాకెట్ చేతపట్టిన ఈ యంగ్ గన్ ఆరు నెలల్లోనే టాప్-20లోకి దూసుకొచ్చింది. అదే జోరులో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకోవడంతో పాటు వరుసగా రెండేండ్లు నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగింది! ఆట విడుపు కోసం ప్రారంభించిన గోల్ఫ్‌లోనూ ప్రొఫెషనల్‌గా ఎదిగిన ఘనత ఆమెది. పాతికేండ్లకే ఇన్ని సాధించిన ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ.. క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరుస్తూ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
బ్రిస్బేన్: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ.. ఆటకు వీడ్కోలు పలికింది. వరుసగా రెండేండ్ల పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కొనసాగిన ఈ ఆస్ట్రేలియా స్టార్.. పాతికేండ్ల వయసులోనే అనూహ్యంగా ఆటకు టాటా చెప్పింది. 2011లో జూనియర్ వింబుల్డన్ టైటిల్ పట్టడంతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బార్టీ.. తన కెరీర్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. 46 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకి ఎక్కిన బార్టీ.. 2021లో వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడి తన జన్మ ధన్యమైందని పేర్కొంది. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకొని 44 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన లోకల్ ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. వరుసగా మూడో ఏడాది ప్రపంచ నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించిన బార్టీ.. తన ఇతర కలలను సాకారం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించిన బార్టీ.. ఒకప్పటి తన డబుల్స్ పార్ట్నర్ కేసీ డెల్లక్వాతో కలిసి రూపొందించిన వీడియోలో తన మనోగతాన్ని ఆవిష్కరించింది. బార్టీ నిర్ణయంతో షాక్‌కు గురైన క్రీడాలోకం ఆమె ఘనతలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.
1 బార్టీ తన కెరీర్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియా ఓపెన్) గెలిచింది.
మనసుకు నచ్చిందే చేయడం నాకు అలవాటు. ప్రస్తుతం ఇదే సరైన నిర్ణయం అనిపిస్తున్నది. టెన్నిస్ నాకు చాలా ఇచ్చింది. వింబుల్డన్ టైటిల్ నెగ్గినప్పుడు నా జన్మ సార్థకమైందనుకున్నా. ఆ విజయంతో నా దృక్పథం మారిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నా ఆనందాన్ని పదింతలు చేసింది. అత్యున్నత స్థాయిలో వంద శాతం శ్రమించేందుకు ప్రస్తుతం నా శరీరం అనుకూలంగా లేదనిపిస్తున్నది. అందుకే ఎంతో కష్టమైనా.. నా జీవితంలో మిగిలిన కలలను సాకారం చేసుకునేందుకు బాగా ఆలోచించి రాకెట్ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నా.
– ఆష్లే బార్టీ

Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ashleigh Barty
- retirement
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

