Asalem Jarigindi | ఊహించని విజయమిది

‘కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. అలాంటి సక్సెస్‌ను మాకు అందించిన చిత్రమిది’ అని అన్నారు శ్రీరామ్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకుడు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. సంచితా పదుకొనే కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘తెలుగులో సహాయ పాత్రలు ఎక్కువగా వరిస్తున్నాయి. అలాంటి క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటూ సోలో హీరోగా మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నా. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో దర్శకనిర్మాతలు చెప్పిన కథ నచ్చింది. షూటింగ్ మొత్తం సరదాగా సాగింది. పల్లెటూరికి విహారయాత్రకు వెళ్లిన అనుభూతి కలిగింది’ అన్నారు. నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ ‘మా తొలి సినిమా ఇది. పరిమిత బడ్జెట్లో సినిమాను తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది. వసూళ్లు బాగున్నాయి. ఊహించని విజయమిది’ అని తెలిపారు. దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ ‘ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత జాన్సన్‌కు దక్కుతుంది. సినిమా హిట్ అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి హీరో శ్రీరామ్. నన్ను, నా కథను నమ్మి ప్రోత్సహించారు’ అని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

