Blast OTT | థియేటర్లలో హిట్.. ఓటీటీలోకి అర్జున్ ‘బ్లాస్ట్’!
Blast OTT | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నటించి థియేటర్లలో భారీ విజయం అందుకున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’.
Blast OTT | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నటించి థియేటర్లలో భారీ విజయం అందుకున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం థియేటర్లలో ఉండగానే ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జూన్ 25 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను ‘బ్లాస్ట్ జోన్’ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.
‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆయన మార్క్ బీజీఎం యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది. అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి, అర్జున్ చిదంబరం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే సరికొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయమయ్యాడు.
కథ విషయానికి వస్తే, రాజారామ్ అనే కరాటే మాస్టర్ కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. రాజారామ్ పిల్లలకు కరాటే శిక్షణ ఇస్తూ, మెడికల్ షాప్ నడుపుతుంటాడు. అతని భార్య నీలవేణి కూడా ఒకప్పుడు కరాటే ఛాంపియనే. వీరి కూతురు నీల ఐటీ ఉద్యోగం చేస్తుంటుంది. రాజారామ్ చిన్నప్పటి నుంచే తన కూతురిని సమాజంలో అన్యాయం జరిగితే ఎదురించేలా ధైర్యంగా పెంచుతాడు. ఒకరోజు లోకల్ రౌడీ కృపాకర్ మెడికల్ షాప్‌లోకి వచ్చి గొడవ చేసి బలవంతంగా మందులు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. తండ్రి నేర్పిన ధైర్యంతో నీల ఆ రౌడీని చితకబాదుతుంది. పోలీసులు అతన్ని జైల్లో పెడతారు. అయితే ఆ కృపాకర్ గ్యాంగ్‌కు వెనుక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హంతకుడైన అబ్రహం ఉంటాడు. ఈ గొడవ కారణంగా అబ్రహం గ్రూప్ నీల కుటుంబంపై పగ పెంచుకుని ఏం చేస్తారు అనేది ఈ సినిమా కథ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

