Bra straps | ‘బ్రా స్ట్రాప్స్’ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Bra straps : మహిళలు తమ చెస్ట్ అందంగా కనిపించడం కోసం, సౌకర్యవంతంగా ఉండటం కోసం సాధారణంగా 'బ్రా'లను ధరిస్తుంటారు. అయితే ఇలా 'బ్రా'లు ధరించే కొందరిలో బ్రా స్ట్రాప్స్ కింద చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. బ్రా స్ట్రాప్స్ చర్మానికి బిగ్గరగా అతుక్కుని ఉండటంవల్ల వాటి కింద ఉన్న చర్మం రంగు మారుతుంది. శరీరం రంగుతో పోల్చితే బ్రా స్ట్రాప్స్ కింది చర్మం కొంత తెల్లగానో, నల్లగానో, ఎర్రగా కమిలినట్లుగానో ఉంటుంది. చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ బ్రా మచ్చల సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Bra straps : మహిళలు తమ చెస్ట్ అందంగా కనిపించడం కోసం, సౌకర్యవంతంగా ఉండటం కోసం సాధారణంగా ‘బ్రా’లను ధరిస్తుంటారు. అయితే ఇలా ‘బ్రా’లు ధరించే కొందరిలో బ్రా స్ట్రాప్స్ కింద చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. బ్రా స్ట్రాప్స్ చర్మానికి బిగ్గరగా అతుక్కుని ఉండటంవల్ల వాటి కింద ఉన్న చర్మం రంగు మారుతుంది. శరీరం రంగుతో పోల్చితే బ్రా స్ట్రాప్స్ కింది చర్మం కొంత తెల్లగానో, నల్లగానో, ఎర్రగా కమిలినట్లుగానో ఉంటుంది. చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ బ్రా మచ్చల సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..
చిట్కాలు
పాలు, బాదం నూనె
బ్రా స్ట్రాప్స్వల్ల మచ్చలు ఏర్పడినచోట పాలు, బాదాం నూనె మిశ్రమాన్ని రాసి మృదువుగా మర్దన చేయాలి. ఆ తర్వాత మిశ్రమం రాసిన ప్రదేశాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. అయితే కడగడానికి సబ్బు వాడకూడదు. ఇలా తరచూ చేస్తే బ్రా స్ట్రాప్స్ మచ్చలు మాయమవుతాయి.
నిమ్మ రసం, చక్కెర
చెంచా చక్కెరలో అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మరకలున్నచోట రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడంవల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి.
సన్‌స్క్రీన్ లోషన్
సన్‌స్క్రీన్ లోషన్‌ను తరచూ చర్మానికి రాసుకోవడం ద్వారా సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. దాంతో ఒంటిపై బ్రా స్ట్రాప్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. పాత మరకలు మరింత పెరగకుండా చేసుకోవచ్చు.
పెరుగు, పసుపు మిశ్రమం
ఒక చెంచా పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బ్రా మచ్చలున్నచోట రాయాలి. ఇలా తరచూ రాస్తుంటే మెల్లమెల్లగా మార్పు కనిపిస్తుంది.
నీళ్ల థెరపీ
చర్మం ఆరోగ్యానికి నీళ్లు కూడా చాలా అవసరం. తగినన్ని నీళ్లు తాగడంవల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా తాజాగా కాంతులీనుతుంది. అదేవిధంగా చర్మంపై మరకలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
ఎస్సెన్షియల్ నూనెలు
లావెండర్ లాంటి ఎస్సెన్షియల్ నూనెలు బ్రా స్ట్రాప్స్‌ను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి. బ్రా మరకలపై ఈ నూనెలను మృదువుగా రుద్దాలి. దాంతో ఆ నూనెల నుంచి పోషకాలు అంది చర్మం కాంతులీనుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

