పుణె, నవంబర్ 16: స్కూటర్ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా అప్రిలియా ఎస్ఆర్ మోడల్‌ను సరికొత్తగా తీర్చిదిద్ది దేశీయ మార్కెట్లోకి మళ్లీ విడుదల చేసింది పియాజియో ఇండియా. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్లో అప్రిలియా ఎస్ఆర్ 160 మోడల్ రూ.1.17 లక్షలుగాను, అప్రిలియా ఎస్ఆర్ 125 మోడల్ రూ.1.07 లక్షలకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు పుణె షోరూంనకు సంబంధించినవి. ఈ నూతన స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ముందస్తుగా రూ.5 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.