మీరే భారత బ్రిటిష్ హై కమిషనర్ అవ్వొచ్చు ..!
మీరే భారత బ్రిటిష్ హై కమిషనర్ అవ్వొచ్చు ..! | అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఒక్క రోజు భారత బ్రిటిష్ హై కమిషనర్గా వ్యవహరించే అవకాశాన్ని బ్రిటిష్ హై కమిషనర్ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 18-23 సంవత్సరాల వయసున్న మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకు ‘వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు యువత ఎలా మద్దతు ఇస్తుంది’ అనే అంశంపై

హైదరాబాద్ : అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఒక్క రోజు భారత బ్రిటిష్ హై కమిషనర్గా వ్యవహరించే అవకాశాన్ని బ్రిటిష్ హై కమిషనర్ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 18-23 సంవత్సరాల వయసున్న మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ‘వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు యువత ఎలా మద్దతు ఇస్తుంది’ అనే అంశంపై ఒక్క నిమిషం నిడివితో కూడిన వీడియోను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో #DayoftheGirl యాష్ట్యాగ్తో @UKinIndiaను ట్యాగ్ చేస్తూ అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ నెల 22లోగా ప్రక్రయను పూర్తి చేయాల్సి ఉంటుందని బ్రిటిష్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా అలెక్స్ ఎల్లిస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్యపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందన్నారు. అందుకే యూకే నిర్వహించిన జీ7 దేశాల సదస్సులో ఆడపిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే యూకే ఈ ఏడాది ఇండియాకు ఇచ్చే ఫెలోషిప్లలో 60శాతం, స్కాలర్షిప్లలో 52శాతం మహిళలకు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. సమానత్వ ప్రపంచాన్ని నిర్మించేందుకు ఆడపిల్లలను చదివించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇండియాలోని ఎవరైనా ఒక యువ మహిళకు బ్రిటిష్ హైకమిషనర్ అయ్యే అవకాశం ఇచ్చి, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించాలనుకుంటున్నామన్నారు. 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Would you like to be 🇬🇧 High Commissioner for a Day?
— UK in Hyderabad 🇬🇧 🇮🇳 (@UKinHyderabad) September 13, 2021
Calling women across India (18-23 years) to participate in our International #DayoftheGirl Child competition.
For more details: https://t.co/YXhHmAVOxf pic.twitter.com/o3iyfBNYvh
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

