సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

అమరావతి,జూన్ 4: నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్‌ని వేధించిన అధికారి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆడియో లీకేజీతో సూపరింటెండెంట్ ప్రభాకర్ బండారం బయటపడింది. చేతులు కట్టేసి గదిలోకి తీసుకెళ్తానంటూ వేధింపులకు దిగాడు సూపరింటెండెంట్ ప్రభాకర్. అతని తీరుని ఫోన్లోనే కడిగేసిన వైద్యవిధ్యార్థిని.. హౌస్ సర్జన్ మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించారు. ఆడియో లీకేజీతో తర్వాత సూపరింటెండెంట్ ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సూపరింటెండెంట్ ప్రభాకర్ వ్యవహారంపై విచారణ కోరారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. తక్షణం సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్‌తో మాట్లాడిన వాసిరెడ్డి.. ఇలాంటి కామాంధుల్ని ఉపేక్షించరాదని కోరారు. వైద్య విద్యార్థినులతో అసభ్య ప్రవర్తనపై బాధితులు స్వయంగా సంప్రదించవచ్చన్నారు. కరోనా సమయంలో ప్రత్యక్షదైవంగా చూస్తున్న వైద్య వృత్తికి మచ్చతెచ్చేలా నెల్లూరు సూపరింటెండెంట్ వ్యవహరించటం బాధాకరమన్నారు. సూపరింటెండెంట్ ప్రవర్తనతో మనోవేదనకు గురైన బాధితులంతా నిర్భయంగా ముందుకొచ్చి మహిళా కమిషన్‌కు చెప్పాలని పద్మ కోరారు. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచుతామని, విచారణలో అన్ని విషయాలు వెల్లడించాలన్నారు వాసిరెడ్డి పద్మ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

