అలాంటి భేదాలు చూపించను

‘లాక్డౌన్ సమయంలో ఈ సినిమా అంగీకరించా. దర్శకుడు మారుతి రియలిస్టిక్ కథాంశాలకు తనదైన శైలి వినోదాన్ని జోడించి జనరంజకంగా ఆవిష్కరిస్తుంటారు. సంపూర్ణ వినోదాత్మక చిత్రానికి స్వరాల్ని అందించడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్. ఆయన మ్యూజిక్ అందించిన తాజా చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకుడు. సంతోష్‌శోభన్, మెహరీన్ జంటగా నటించారు. వి.సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాతలు. నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అనూప్‌రూబెన్స్ మాట్లాడుతూ ‘హౌసింగ్ కాలనీలో జరిగే కథ ఇది. మనలోని భయాలను, అభద్రతను హాస్యపంథాలో ఆవిష్కరిస్తుంది.
కథ వినగానే సంగీతానికి మంచి స్కోప్ ఉందనిపించింది. ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి. కె.కె, అనంత్‌శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్నందించారు. సిధ్‌శ్రీరామ్ ఆలపించిన ‘సో సో గా..’ అనే పాట నా ఫేవరెట్. దర్శకుడి అభిరుచి, గీత రచయితల సాహిత్యానికి అనుగుణంగా నేను స్వరాల్ని అందిస్తుంటా. ఓ సంగీత దర్శకుడిగా సినిమాల విషయంలో చిన్నా, పెద్దా అనే భేదాల్ని పాటించను. ఏ సినిమా అయినా ఒకేరకమైన అంకితభావంతో పనిచేస్తా. అయితే పెద్దహీరోతో పనిచేస్తున్నప్పుడు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

