Rajinikanth: ‘పెద్దన్న’గా రాబోతున్న రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన శివ దర్శకత్వంలో అన్నాత్తె అనే సినిమా చేశాడు. గురువారం చిత్ర టీజర్ విడుదల కాగా, ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. టీజర్ పక్కా కమర్షియల్ కోణంలో రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. రజనీని పవర్ఫుల్ రోల్లో దర్శకుడు శివ చూపించబోతున్నారని తాజా టీజర్ ని చూస్తుంటే స్పష్టమవుతుంది.
అన్నాత్తె చిత్రం తెలుగులోను విడుదల కానుండగా, పెద్దన్న అనే టైటిల్‌తో ఇక్కడ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. అన్నాత్తే అంటే తమిళంలో అన్నయ్య అనే అర్థం వస్తుంది. అదే అర్థంతో తెలుగులో ఈ చిత్రాన్నిపెద్దన్నగా రిలీజ్ చేయబోతుండటం విశేషం. నవంబర్ 4న చిత్రాన్ని విడుదల చేయనుండగా, పెద్దన్న రాకతో ఊహించని విధంగా దీపావళి బాక్సాఫీస్ బరిలో పోటీ పెరిగిపోయింది.
ఈసారి దీపావళికి పెద్ద సినిమా లేదనే లోటును పెద్దన్న తీర్చాడు. అయితే అదే సమయంలో వరుడు కావలెను, రొమాంటిక్, మంచి రోజులు వచ్చాయి లాంటి సినిమాలు రిలీజ్ కానుండగా, పెద్దన్నతో ఈ సినిమాలు పోటీ పడి నిలుస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. పెద్దన్న సినిమాను నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి తీసుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం పక్కా అని తేలిపోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- annathe
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

