Anchor Suma Remuneration | కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో వరుస సినిమాలు చేసిన సుమ కనకాల.. ఆ తర్వాత కేవలం టెలివిజన్‌కు మాత్రమే పరిమితం అయిపోయింది. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా పోటీ లేకుండా సాగుతుంది సుమ. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం అగ్ర నిర్మాతలు వేచి చూస్తుంటారు. ఏదైనా ఈవెంట్ జరగాలి అంటే అందులో సుమ యాంకర్ అయితే చాలు.. ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగించింది ఈమె. అందుకే సుమ రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కోసం కనీసం 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
బుల్లితెరపై ఈ స్థాయిలో దూసుకుపోతుంది కాబట్టే సినిమాల వైపు అస్సలు చూడలేదు సుమ. తోటి యాంకర్స్ సినిమాలు చేసినా కూడా.. సుమ మాత్రం కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితమైంది. అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సుమ సినిమాల్లోకి వస్తుంది. ఈమె ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయతీ ( Jayamma Panchayathi ) షూటింగ్ పూర్తయింది. ఇందులో టైటిల్ రోల్ చేస్తోంది సుమ. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం సుమ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
సాధారణంగానే ఒక్కో షోకు 3 లక్షలు తీసుకునే ఈమె.. ఇక్కడ మాత్రం సినిమా కోసం దాదాపు 50 లక్షల వరకు ఛార్జ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆమెకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా సై అనేశారు. సుమ ఉంటే కచ్చితంగా థియేటర్స్ పరిస్థితి ఎలా ఉన్నా.. టీవీలో అయినా వర్కవుట్ అయిపోతుంది. అక్కడే బడ్జెట్ అంతా రికవర్ అవుతుంది. ఎందుకంటే టెలివిజన్‌లో సుమకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. ఏదేమైనా ఈ చిత్రం తర్వాత మళ్లీ వరసగా సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలిక.