ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు నటిస్తూ, కాండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మించిన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రధారులు. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈసినిమా థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా థ్యాంక్స్మీట్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు.
అన్ని ఏరియాల్లోనూ సినిమాకు మంచి స్పందన వస్తున్నదని నిర్మాతలు నక్కిన త్రినాథరావు, కాండ్రేగుల నాయుడు ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమాలో భాగం అయినందుకు హీరో విక్రమ్ సహిదేవ్, నటి ఇంద్రజ ఆనందం వెలిబుచ్చారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ చిత్రబృందానికి అభినందనలు అందించారు. ఇంకా పాత్రికేయులు అబ్దుల్, శివ కూడా మాట్లాడారు.