Ira Khan | ఆ భయంకరమైన వ్యాధితో బాధపడిన బాలీవుడ్ స్టార్ హీరో కూతురు
Ameer Khan Daughter | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్ తాను ఐదేళ్లుగా మెంటల్ డిప్రెషన్ డిజాస్టర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది. ఐరా తల్లిదండ్రులు అమీర్‌ఖాన్, రీనా దత్తా విడాకుల నిర్ణయం తననెంతో ప్రభావితం చేసిందని, ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు వెళ్లిపోయానని ఐరా ఖాన్ తెలిపింది.
Ameer Khan Daughter | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్ తాను ఐదేళ్లుగా మెంటల్ డిప్రెషన్ డిజాస్టర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది. ఐరా తల్లిదండ్రులు అమీర్‌ఖాన్, రీనా దత్తా విడాకుల నిర్ణయం తననెంతో ప్రభావితం చేసిందని, ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు వెళ్లిపోయానని ఐరా ఖాన్ తెలిపింది. అమ్మా-నాన్నలు విడాకులు విడాకులు తీసుకుంటున్న టైమ్‌లో తను అమెరికాలో ఉన్నానని, ఈ విషయం తెలియగానే వెంటనే ఇండియా వచ్చేశానని ఐరా వెల్లడించింది.
అంతేకాకుండా తన కుటుంబంలోనే కొంతమంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందుకే తను చిన్న సమస్యను కూడా తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయానని వాపోయింది. డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఎంత ప్రయత్నించినా 8-10 నెలలకు ఒకసారి మానసికంగా కుంగిపోతున్నాని చెప్పింది. అలా ఏడుస్తూనే ఉంటానని, బాధగా ఉండిపోతాని, ఒక్కోసారి నాలుగైదు రోజులు తినకుండా ఉండిపోతానని తెలిపింది. కానీ మా నాన్న సపోర్టుతో డిప్రెషన్ నుంచి బయటపడగలిగానని చెప్పుకొచ్చింది.
కాగా ఇటీవలే ఐరా మెంటల్ హెల్త్ సపోర్ట్ అందించే అగత్సు ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వూలో తను బాధపడుతున్న వ్యాది గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఇక 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమీర్‌ఖాన్ పదహారు సంవత్సరాల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. మళ్లీ 2005లో ప్రొడ్యూసర్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

