Amartya Sen: కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన అమర్త్యా సేన్
Amartya Sen: భూమిని ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్సిటీ ఇచ్చిన ఆదేశాలను నోబెల్ గ్రహీత అమర్త్యాసేన్ కోర్టులో సవాల్ చేశారు. ఆయన ఆ కేసులో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.ఆ భూమిని వర్సిటీ తమకు లీజు ఇచ్చినట్లు పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. వర్సిటీ ఆదేశాలపై ఇవాళ కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది.
కోల్‌కతా: శాంతినికేతన్లో ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని అమర్త్యా సేన్(Amartya Sen)కు విశ్వభారతి యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్.. కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఖాళీ స్థలాన్ని సేన్ అక్రమంగా అక్రమించారని, ఒకవేళ మే 6వ తేదీ అక్కడ నుంచి ఆయన వెళ్లకుంటే, తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విశ్వభారతి యూనివర్సిటీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ బిబాస్ రంజన్ దే నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించనున్నది.
తన తండ్రి అశుతోష్ సేన్‌కు 1943 అక్టోబర్‌లో విశ్వభారతి వర్సిటీ 1.38 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లీజు ఇచ్చిందని, ఆ భూమిలోనే ప్రతీచి బిల్డింగ్‌ను కట్టినట్లు అమర్త్యా సేన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ సేన్‌కు మద్దతుగా ఆయన ఇంటి ముందు ధర్నా చేపట్టాలని మంత్రులను సీఎం మమతా బెనర్జీ కోరారు. మరో వైపు తాము ఆ బిల్డింగ్‌ను కూల్చడం లేదని విశ్వభారతి అధికారి ఒకరు తెలిపారు.
వర్సిటీ ఆదేశాలపై ఇవాళ కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

