అను ఇమ్మాన్యుయేల్‌తో అల్లు శిరీష్ లవ్ స్టోరీ నిజమేనా..?

హీరోయిన్లతో ఎఫైర్ అనే మాట వినగానే టాలీవుడ్ లో కొందరు హీరోలు గుర్తుకొస్తారు. కానీ అలాంటి లిస్టులో అల్లు శిరీష్ మాత్రం లేడు. ఈయన తన సినిమాలు తాను చేసుకుంటాడు. లేదంటే ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ బిజీగా ఉంటాడు. అంతేకానీ హీరోయిన్లు, ప్రేమకథలు, ఎఫైర్స్ అనే మాటలకు మాత్రం దాదాపు దూరంగానే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు అల్లు శిరీష్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తుంది. శిరీష్ ఇప్పుడు ఓ హీరోయిన్ మాయలో పడిపోయాడని ప్రచారం జరుగుతుంది.
అను ఇమ్మాన్యుయేల్ తో సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడిపిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఈయన పోస్ట్ చేసిన వీడియో కారణంగానే ఈ వార్తలు వస్తున్నాయి. ఈయన కూడా మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరోయినే కావడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి..అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది అను. ఈ భామ ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. అను బర్త్ డే సందర్భంగా శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. అందులో ఆమెతో ఉన్న విధానం చూసిన తర్వాత కచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు ఎక్కువైపోతున్నాయి.
మార్చి 28న అను పుట్టిన రోజు. ఈమెకు తనదైన శైలిలో అల్లు శిరీష్ బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతేకాదు ఈమెను సైకో అంటూ ప్రేమగా పిలిచాడు. అను చాలా క్యూట్‌గా ఉంటుందంటూ శిరీష్ చెప్తున్నాడు అంటే.. తానెప్పుడు చెప్పాను అంటూ శిరీష్ అడుగుతాడు. ఆ తర్వాత నీ గురించి నాకు తెలుసు అంటే నువ్వు నా ఫ్యాన్.. ఫ్యాన్స్ అన్నీ ఫాలో అవుతుంటారంటూ చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్.
ఆ వెంటనే హ్యాపీ బర్త్ డే సైకో అంటూ చెప్పాడు అల్లు శిరీష్. నీకు ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నానని తెలుసు.. కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయింది.. హ్యాపీ బర్త్ డే సైకో.. నీకు అంతా మంచి జరగాలి అంటూ విష్ చేసాడు శిరీష్. ఈ వీడియో చూసి సిగ్గు పడింది అను ఇమ్మాన్యుయేల్. ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే నటించబోతున్నారని కూడా తెలుస్తుంది. మరోవైపు వీళ్ల సాన్నిహిత్యం చూసిన తర్వాత కచ్చితంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అర్థమైపోతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహా సముద్రం సినిమాతో బిజీగా ఉంది అను ఇమ్మాన్యుయేల్. మరోవైపు శిరీష్ కూడా తన కొత్త సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

